మెడికల్ కళాశాలకు బస్సును ప్రారంభించిన మంత్రులు..

సంగారెడ్డి జిల్లా మెడికల్ కళాశాలకు సీఎస్ఆర్ నిధులతో

Update: 2024-11-06 12:55 GMT

దిశ, సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా మెడికల్ కళాశాలకు సీఎస్ఆర్ నిధులతో కొనుగోలు చేసిన బస్సును బుధవారం రాష్ట్ర దేవాదాయ, అటవీ పర్యావరణ శాఖ, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌చార్జీ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. ఈ బస్సు అందుబాటులోకి రావడం వల్ల మెడికల్ విద్యార్థుల రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని, ఇది విద్యార్థుల ప్రయాణ సౌలభ్యానికి తోడ్పడుతుందని మంత్రులు తెలిపారు. సీఎస్ఆర్ నిధులు వినియోగించడం ద్వారా గ్రామీణ ప్రాంతాలకు మెడికల్ కళాశాల సేవలు విస్తరించడానికి ఒక గొప్ప అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ గీతామాధురి , సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Similar News