అర్ధరాత్రి పేకాట శిబిరం పై దాడి..

అర్ధరాత్రి పేకాట శిబిరం పై దాడి చేసి 12 మంది వ్యక్తులను 52,500 నగదు బైక్, స్కూటీ, ఆటో సీజ్ చేసినట్లు తూప్రాన్ సీఐ రంగా కృష్ణ తెలిపారు.

Update: 2025-01-01 03:57 GMT

దిశ, తూప్రాన్ : అర్ధరాత్రి పేకాట శిబిరం పై దాడి చేసి 12 మంది వ్యక్తులను 52,500 నగదు బైక్, స్కూటీ, ఆటో సీజ్ చేసినట్లు తూప్రాన్ సీఐ రంగా కృష్ణ తెలిపారు. వివరాల ప్రకారం తూప్రాన్ మండల పరిధిలోని అల్లాపూర్ శివారులో మంగళవారం రాత్రి పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి సీఐ దాడులు నిర్వహించారు. 12 మంది వ్యక్తులను వారి నుండి నగదు బైక్, స్కూటీ, ఆటో, సెల్ ఫోన్లు, సీజ్ చేసి కేసునమోదు చేసినట్లు తెలిపారు. పేకాట, అక్రమ మట్టి రవాణా, గంజాయి వంటివి తమ దృష్టికి వస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు.


Similar News