Medak SP : సమస్యలు చట్టపరంగా పరిష్కరించాలి

ప్రజావాణి సమస్యలను చట్టపరంగా సమస్యల పరిష్కారం చేయాలని

Update: 2024-07-29 12:55 GMT

దిశ,మెదక్ టౌన్ : ప్రజావాణి సమస్యలను చట్టపరంగా సమస్యల పరిష్కారం చేయాలని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి ఫిర్యాదుదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్ ల  ఎస్ఐ, సీఐ లకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితి ని, పరిష్కారానికి సూచనలు చేయడం జరిగిందని అన్నారు.

ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవల్ని వినియోగించుకునేల చూడాలని అన్నారు. వారి వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకొనేల, పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా సత్సంబంధాలు కలిసి ఉండాలని అన్నారు. శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని తెలిపారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారిస్తున్నామని అన్నారు.

Tags:    

Similar News