పండుగలను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలి.. MLA Padma Devender Reddy

పండుగలను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని మెదక్ MLA పద్మా దేవేందర్ రెడ్డి ఆకాక్షించారు.

Update: 2022-12-16 12:41 GMT

దిశ, మెదక్ టౌన్: పండుగలను ప్రతి ఒక్కరు సంతోషంగా జరుపుకోవాలని, అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం పేదవాళ్లు పండగులను సంతోషంగా జరుపుకోవడానికి సహకరిస్తోందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తెలిపారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా శుక్రవారం వైస్రాయ్ గార్డెన్ లో మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం క్రిస్మస్ వేడుకలను ప్రారంభించి కానుకలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తోటి మనుషుల పట్ల ప్రేమ, దయతో ఉండాలని యేసు ప్రభువు ప్రబోధించారని గుర్తు చేశారు. ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరగడం జిల్లా కీర్తిని ఇనుమడింపజేస్తుందని చెప్పారు. మెదక్ పట్టణాన్ని అందమైన రోడ్లతో సుందరీకరించుకుంటున్నామని అన్నారు. ఇటీవల మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని రికార్డు స్థాయిలు 407 కాన్పులు చేశామని, త్వరలో జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు కానుందని పేర్కొన్నారు.

సకల సౌకర్యాలతో నూతన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు నిర్మించుకుంటున్నామని అన్నారు. అక్కడక్కడా మిగిలిపోయిన అర్హులైన మరికొందరికి పింఛన్లు అందిస్తామని, సొంత జాగా కలిగిన వారికి ఇల్లు కట్టుకోవడానికి రూ.3 లక్షల ఆర్ధిక సహాయం అందజేస్తామని అన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా అభివృద్ధి వేగంగా సాధించుకుంటున్నామని తెలిపారు. క్రైస్తవుల కోసం స్మశాన వాటికకు స్థలం, కమ్యూనిటీ భవన నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, ఆర్డీవో సాయి రామ్, జిల్లా మైనారిటీ అధికారి జెంలా నాయక్, మునిసిపల్ కమిషనర్ జానకి రామ్ సాగర్, మెదక్ నియోజక వర్గ క్రిస్టియన్ సెలెబ్రేషన్ ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షుడు రెవరెండ్ సంజీవరావు, అశోక్, కౌన్సిలర్లు , కో అప్షన్ సభ్యులు, పాస్టర్లు, క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News