పలు అభివృద్ధి పనులకు శ్రీకారం…

నారాయణఖేడ్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల డాక్టర్ సంజీవరెడ్డి ప్రారంభించారు.

Update: 2024-01-31 14:49 GMT

దిశ, నారాయణఖేడ్: నారాయణఖేడ్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల డాక్టర్ సంజీవరెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే పట్లోళ్ల డాక్టర్ సంజీవరెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నారాయణఖేడ్‌కు మొదటిసారి కలెక్టర్ రావడంతో బోకే అందజేసి సన్మానం స్వాగతం పలికారు. బుధవారం నారాయణఖేడ్ మండలంలోని పంచాగామ నూతన గ్రామ పంచాయతీ రూ.18 లక్షలు, సిర్గాపూర్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ రూ.20 లక్షలతో పంచాయతీ భవనం, గ్రంథాలయంను, కస్తూర్బా గాంధీ అదనపు గదులను ప్రారంభించారు. అనంతరం నారాయణఖేడ్ పట్టణంలోని బాల సదనంలో భవనం స్లాబ్ వరకు వేసి వదిలేసిన గుత్తేదారు వదిలిపెట్టారని, భవనం పూర్తి చేసి వినియోగంలోకి తెచ్చే విద్యార్థులకు ఉపయోగపడే విధంగా చూడాలని అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదువుకొని ఉద్యోగం సాధించాలన్నారు. చదువులో ఫెయిల్ అయిన కానీ, నిరాశ చెందకుండా మళ్లీ ప్రయత్నం చేసి ఉత్తీర్ణ కావాలన్నారు. చదువుతోనే భవిష్యత్తు మెరుగుపడుతుందని అన్నారు. హాస్టల్‌‌లో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి మాట్లాడుతూ.. కస్తూర్బా గాంధీ కల్లేరులో హాస్టల్ కోసం స్థలం లేకపోవడంతో తన తండ్రి స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల కృష్ణారెడ్డి సిర్గాపూర్‌లో స్థలం కొని హాస్టల్ నిర్మించడం జరిగిందన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలన్నారు. చదువుతోనే భవిష్యత్తు వెలుగు నిస్తుందని, ప్రతి ఒక్కరు గ్రహించి కష్టపడి చదివి పేరు సంపాదించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఆర్డీఓ వెంకటేష్, ఎంపీపీ జర మైపాల్ రెడ్డి, జెడ్పీటీసీ రాఘవరెడ్డి,  సర్పంచ్ స్వప్న శంకరయ్య స్వామి, మాణిక్యమ్మ, ఎంపీటీసీ బీరప్ప, మారుతి రావు, ప్రిన్సిపాల్ లలిత తదితరులు పాల్గొన్నారు.


Similar News