బీఆర్ఎస్ పాలనతో రైతుల జీవితాల్లో వెలుగులు : నీలం మధు ముదిరాజ్
బీఆర్ఎస్ పాలనలో రైతుల జీవితాల్లో వెలుగులు నిండాయని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ అన్నారు.
దిశ, పటాన్ చెరు : బీఆర్ఎస్ పాలనలో రైతుల జీవితాల్లో వెలుగులు నిండాయని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ అన్నారు. పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రైతుకు నిత్యం ఉపయోగపడే ట్రాక్టర్ నడుపుతూ అందరినీ అలరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రైతులు అప్పులు, వడ్డీల పాలు కాకుండా పంటకు పెట్టుబడి కోసం రైతుబంధు ప్రవేశపెట్టి సంవత్సరానికి ఎకరాకు రూ.10 వేలు ప్రభుత్వం అందిస్తుందన్నారు.
రైతు బీమా రైతులకు ఎంతగానో ఉపయోగపడుతోందిని అన్నారు. రైతుకు ఒక గుంట భూమి ఉన్న రైతు బీమా వర్తిస్తుంది అని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పంటకు మద్దతు ధర ఇవ్వడంతో పాటు పండించిన ప్రతి గింజనూ కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. రైతును రాజుగా మార్చిన ఈ ప్రభుత్వాన్ని రైతులు వదులుకోబోరని అండగా ఉండి మళ్లీ గెలిపించుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ఈవో కవిత, వార్డు సభ్యులు మురళీ, ఆంజనేయులు, రైతులు, ఎన్ఎంఅర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.