Komurelli Mallanna : కొమురెల్లి మల్లన్నకు కోటొక్క దండాలు
భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ప్రముఖ శైవక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది.
దిశ, కొమురవెల్లి : భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ప్రముఖ శైవక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. కొమురవెల్లికి చేరుకున్న భక్తులు కొనేరులో పవిత్ర స్నానాలు ఆచరించి, భక్తి శ్రద్దలతో మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. అందులో భాగంగా పట్నాలు,అభిషేకం, అర్చన,నిత్యకల్యాణం,బోనం, తిరుగుడు కోడె, కేశ కండన, గంగిరేగు చెట్టుకు ముడుపులు వంటి తదితర మొక్కలు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులు కొండపైనున్న రేణుక ఎల్లమ్మ, నల్ల పోచమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ ఈ ఓ బాలాజీ, ఏ ఈ ఓ బుద్ధి శ్రీనివాస్,ఆలయ పర్యవేక్షకులు శ్రీరాములు, సురేందర్, ప్రధానార్చకులు మహాదేవుని మల్లికార్జున్,ఆలయ సిబ్బంది,అర్చకులు,ఓగ్గు పూజారులు భక్తులకు సేవలందించారు.