మైనర్ బాలిక కిడ్నాప్..నిందితుడి రిమాండ్
మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన నిందితుడిని రిమాండ్ కు పంపినట్లు హద్నూర్ సబ్-ఇన్స్పెక్టర్ చల్లా రాజా శేఖర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
దిశ, జహీరాబాద్: మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన నిందితుడిని రిమాండ్ కు పంపినట్లు హద్నూర్ సబ్-ఇన్స్పెక్టర్ చల్లా రాజా శేఖర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రిమాండ్ చేసిన వారిలో న్యాల్ కల్ మండలం మామిడి గ్రామానికి చెందిన ఈడిగి వినోద్ (21) ఉన్నారు. నిందితుడు అదే గ్రామానికి చెందిన మైనర్ బాలిక ను ప్రేమిస్తున్నానని, ప్రలోభ పెట్టి, ఆమె ఫోన్ నెంబర్ తీసుకుని రోజు ఆమెతో ఫోన్ లో మాట్లాడటం, నిరంతరం చాటింగ్ నిర్వహించాడు. ఎక్కడికైనా వెళ్లి పెండ్లి చేసుకుందామని నమ్మబలికి ఆమెను గత నెల 22వ తేదీ అర్ధరాత్రి బలవంతంగా కిడ్నాప్ చేసి హైదరాబాద్ తీసుకుని పోయాడు. మరుసటి రోజు రాత్రి 08.00 గ.లకు ఆమెను మామిడి గ్రామానికి తెచ్చి విడిచి పెట్టి పోయాడు. ఈ విషయమై బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన హద్నూర్ ఎస్సై శనివారం ఉదయం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.