ఆత్మరక్షణ కొరకై కరాటే తప్పనిసరి... ఎమ్మెల్యే
జిల్లాస్థాయి 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ 14, అండర్ 17 బాలుర బాలికల కరాటే పోటీలు సదాశివపేట పట్టణంలోని గంజి మైదానం నందు ఆదివారం నిర్వహించారు.
దిశ, సదాశివపేట : జిల్లాస్థాయి 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ 14, అండర్ 17 బాలుర బాలికల కరాటే పోటీలు సదాశివపేట పట్టణంలోని గంజి మైదానం నందు ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి నైపుణ్యం ప్రదర్శించి రాష్ట్ర స్థాయి , జాతీయస్థాయిలో విద్యార్థులు పేరు ప్రఖ్యాతలు సంపాదించాలన్నారు.
ఆత్మరక్షణ కొరకు కరాటే తప్పనిసరని విద్యార్థులకు తెలిపారు. కరాటే శిక్షణ కల్పిస్తున్న కరాటే మాస్టర్ శంకర్ గౌడ్ ను ఎమ్మెల్యే చింత అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ అపర్ణ శివరాజ్ పాటిల్, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, ఎస్జీఎఫ్ సెక్రెటరీ అమూల్యమ్మ, కరాటే మాస్టర్ సతీష్ గౌడ్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.