Ts News: స్పీడ్ పెంచిన జనసేనాని.. దుబ్బాక వకీల్ సాబ్‌ కోసం భారీ రోడ్ షో

బీసీ ముఖ్యమంత్రితోనే సామాజిక తెలంగాణ సాధ్యపడుతుందని, బంగారు తెలంగాణ పేరిట ప్రజలు మోసపోయారని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు..

Update: 2023-11-23 13:26 GMT

దిశ, చేగుంట: బీసీ ముఖ్యమంత్రితోనే సామాజిక తెలంగాణ సాధ్యపడుతుందని, బంగారు తెలంగాణ పేరిట ప్రజలు మోసపోయారని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దుబ్బాక నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్యే రఘునందన్ రావుకు మద్దతుగా చేగుంటలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ కోసం ప్రజలు అనుకున్నది ఒకటని, అయింది ఒకటని పేర్కొన్నారు. బీసీని సీఎం చేస్తానన్న బీజేపీతోనే సామాజిక తెలంగాణ సాధ్యపడుతుందన్నారు. అందుకోసం దుబ్బాక అభ్యర్థి వకీల్ సాబ్ రఘునందన్ రావును భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.


తాను పుట్టుకతో ఆంధ్ర వాడినైనప్పటికీ తెలంగాణపై మమకారం ఎక్కువగా ఉంటుందని తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం తాను కూడా సహకరిస్తానని పేర్కొన్నారు. ఆంధ్ర కన్నతల్లి అయితే తెలంగాణ నాకు పెంపుడు తల్లి అని తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే రఘునందన్ రావు కోసం తాను ఈరోజు వచ్చానన్నారు. ప్రజల అమూల్యమైన ఓటు కమలం గుర్తుకు వేసి రఘునందన్ రావును భారీ మెజార్టీతో గెలిపించాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. భారతదేశ అభివృద్ధి కోసం బీజేపీ ఆలోచిస్తుందని, తెలంగాణ కోసం ప్రజలు ఆ పార్టీని ఆదరించాలని కోరారు.


ఇక బీజేపీ, జనసేన అభిమానులతో చేగుంట గాంధీ చౌరస్తా మొత్తం కిక్కిరిసిపోగా పెద్ద సంఖ్యలో మహిళలు లాగా జై కళ్యాణ్, జై జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు. తూప్రాన్, చేగుంట సర్కిల్ పోలీసులు ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు కలకుండా వాహనాలను వేరే దారిలో మళ్లింపు చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ వెంట దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, సీనియర్ నాయకుడు వెంగళరావు మాజీ ఎంపీపీ పాండు మండల పార్టీ అధ్యక్షులు భూపాల్, నార్సింగి మండల పార్టీ అధ్యక్షుడు బాల్రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ సుజాత, గొల్లపల్లి సర్పంచ్ ఎల్లారెడ్డి, రెడ్డిపల్లి ఎంపిటిసి శంభుని రవి, మహిళా మోర్చా అధ్యక్షురాలు లావణ్య, యువ మోర్చా అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్, బిజెపి నాయకులు నదీమ్ హసన్ అలీ, రఘువీరారావు, బాలచందర్, హరిశంకర్, బిక్షపతి, రతన్, గణేష్ ,మహేష్, సాయిబాబా, సత్యపాల్ రెడ్డి, వేణుతోపాటు మహిళా నాయకురాలు సుధారెడ్డి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News