దేశ రక్షణ కోసం పాటుపడేది బీజేపీనే

దేశ రక్షణ బీజేపీతోనే సాధ్యమని మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు.

Update: 2024-03-21 15:55 GMT

దిశ, వెల్దుర్తి: దేశ రక్షణ బీజేపీతోనే సాధ్యమని మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. గురువారం మాసాయిపేట్ మండల కేంద్రంలోని మెదక్ పార్లమెంట్ బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి మోదీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేసే మెదక్ పార్లమెంట్ గడ్డపై బీజేపీ జెండా ఎగర వేద్దామని పార్టీ శ్రేణులకు సూచించారు. అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విధానాన్ని అవలంబిస్తోందని త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసుకునేందుకు చర్చలు జరుపుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో మామ, అల్లుడు, కొడుకు తప్ప మిగతా వారంతా కాంగ్రెస్లో చేరుతారని రఘునందన్ రావు తెలిపారు.


Similar News