గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో (2024-25) విద్యా సంవత్సరం) ప్రవేశం కొరకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని టీఎస్ డబ్ల్యూఆర్‌ఈ‌ఐఎస్ మెదక్ ఈస్ట్ రీజియన్ ప్రాంతీయ సమన్వయ కర్త నిర్మల సూచించారు.

Update: 2024-03-12 15:35 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి : తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో (2024-25) విద్యా సంవత్సరం) ప్రవేశం కొరకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని టీఎస్ డబ్ల్యూఆర్‌ఈ‌ఐఎస్ మెదక్ ఈస్ట్ రీజియన్ ప్రాంతీయ సమన్వయ కర్త నిర్మల సూచించారు. కరీంనగర్ జిల్లా అలుగునూర్, రంగారెడ్డి జిల్లా గౌలిదొడ్డి, పరిగి, వికారాబాద్, ఖమ్మం జిల్లాల పరిధిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాలేజీల్లో 8వ తరగతిలో రెగ్యులర్ ప్రవేశం కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా టీఎస్ డబ్ల్యూ ఆర్ విద్యాలయాల్లో బ్యాక్ లాగ్ ఖాళీల ప్రవేశాలకు సైతం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 23వ తేదీ లోపు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 21 ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందన్నారు.


Similar News