11వ రోజుకు చేరిన ఐకేపీ వివోఏల సమ్మె..
ఐకేపీ కార్యాలయం వద్ద గత 11 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్న ఐకేపీ వివోఏలు గురువారం మోకాలపై నిలబడి నిరసన తెలిపారు.
దిశ, కల్హేర్ ; ఐకేపీ కార్యాలయం వద్ద గత 11 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్న ఐకేపీ వివోఏలు గురువారం మోకాలపై నిలబడి నిరసన తెలిపారు. కనీస వేతనం రూపాయలు 26,000 ఇవ్వాలని 10 లక్షల సాధారణ భీమా, ఆరోగ్య భీమా సౌకర్యం కల్పించాలని, సెర్ప్ నుండి ఐడి కార్డులు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కల్హేర్ 11వ రోజు సమ్మె చేస్తున్న వారిని బీజేపీ నాయకులు సమ్మెకు సంఘీభావం తెలిపారు. న్యాయపరమైనటువంటి వివోఏల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివోఏలు శ్రీనివాస్, నాగరాజు, వీరేందర్, అపర్ణ, రుక్మిణి, బాలమణి, శంకర్ సింగ్, జబ్బర్, లింగం, కిషన్, మారుతి,వాసుదేవ్, శివరాం, బాలయ్య, షేర్ అలీ, బీజేపీ నాయకులు సాయిరాం, సంజివ్ పాటిల్, అనిల్ రెడ్డి, మాణిక్యం, అశోక్ పాల్గొన్నారు.