రోడ్ల పై ధాన్యం.. వాహనదారులకు ప్రాణ సంకటం..

పెద్ద శంకరంపేట మండలంలో పంట పొలాల్లో వరి కోతలు కోసి రోడ్ల పై ధాన్యాన్ని ఎండబెట్టే రైతుల పై కఠిన చర్యలు తీసుకుంటామని పెద్ద శంకరంపేట ఎస్సై శంకర్ తెలిపారు.

Update: 2024-11-09 09:27 GMT

దిశ, పెద్ద శంకరంపేట్ : పెద్ద శంకరంపేట మండలంలో పంట పొలాల్లో వరి కోతలు కోసి రోడ్ల పై ధాన్యాన్ని ఎండబెట్టే రైతుల పై కఠిన చర్యలు తీసుకుంటామని పెద్ద శంకరంపేట ఎస్సై శంకర్ తెలిపారు. మండలంలోని పలు ప్రధాన రహదారులలో ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే విధంగా వరి ధాన్యాన్ని రోడ్ల పై ఎండబెట్టరాదని తెలిపారు.

ఈ విధంగా చేయడం వల్ల పగలు, రాత్రి వాహనాల పై వెళ్లే వాహనదారులు ప్రమాదవశాత్తు జారిపడి రోడ్డు ప్రమాదాల గురై ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. ఇతరుల ప్రాణాలు ప్రమాదంలో పడకుండా ఉండేందుకు రైతులు చట్టాన్ని అతిక్రమించి రోడ్ల పై ధాన్యాన్ని ఎండ పెడితే ఏమైనా రోడ్డు ప్రమాదం జరిగితే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. రైతులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శంకర్, ఏఎస్ఐ సునీత పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


Similar News