కేసీఆర్ సాగునీరు తెస్తే...కాంగ్రెస్ ప్రభుత్వం కరువు తెచ్చింది
కేసీఆర్ వ్యవసాయ రంగానికి సాగునీరు తెస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు కన్నీళ్లు తెప్పిస్తుందని దుబ్బాక సమన్వయకర్త రణం శ్రీనివాస్ గౌడ్ ,జెడ్పీటీసీ రణం జ్యోతి, ఎంపీటీసీల పోరం అధ్యక్షుడు బండారు దేవేందర్, మాజీ సర్పంచ్ గడ్డమీది భాగ్య అన్నారు.
దిశ, దౌల్తాబాద్ : కేసీఆర్ వ్యవసాయ రంగానికి సాగునీరు తెస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు కన్నీళ్లు తెప్పిస్తుందని దుబ్బాక సమన్వయకర్త రణం శ్రీనివాస్ గౌడ్ ,జెడ్పీటీసీ రణం జ్యోతి, ఎంపీటీసీల పోరం అధ్యక్షుడు బండారు దేవేందర్, మాజీ సర్పంచ్ గడ్డమీది భాగ్య అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం తిరుమలాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించి కారు గుర్తుకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంద రోజుల్లో హామీలను నెరవేరుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయకుండానే మళ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలను ఎలా ఓట్లు అడుగుతారని వారు ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇప్పటివరకు కొనసాగుతున్నాయని,
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని ఆయన యద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తోడుదొంగలని, ఆ పార్టీలకు ఓట్లు వేస్తే ప్రజలు నష్టపోతారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలోని తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని, ఇందులో భాగంగానే సిద్దిపేట జిల్లా దేశంలోనే నెంబర్ వన్ చేసిన ఘనత మాజీ మంత్రి హరీష్ రావు కే దక్కుతుందన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని గెలిపించుకుంటే మాజీ మంత్రి హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిల ఆధ్వర్యంలో నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్నారు. మల్లన్న సాగర్ కొండపోచమ్మ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లా సస్యశ్యామలం అయిందని అన్నారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని గెలిస్తే పార్లమెంట్లో మన సమస్యలపై గొంతు విప్పి అవకాశం ఉందని, ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, ఎంపీటీసీ మల్లేశం, గ్రామ కమిటీ అధ్యక్షుడు రమేశ్ గౌడ్, మాజీ వైస్ చైర్మన్ వేమ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ లు గడ్డమిది భాగ్య ఎల్లాం, సరుగారు యాదవరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ సత్తయ్య, వార్డ్ మెబర్స్ నాగరాజు, సత్తయ్య, బోటుక సత్తయ్య, లక్ష్మీనారాయణ, కన్నారెడ్డి, రమేశ్, స్వామి, ప్రభాకర్, రాజయ్య, లచ్చయ్య, రవీందర్ రెడ్డి, చలమయ్య, కర్ణకర్, బాల్ రెడ్డి, రాజనర్సు నాయకులు తదితరులు పాల్గొన్నారు.