నేను సచ్చిపోతా..నన్ను ఎందుకు మోసం చేశారు
బీజేపీ తుది జాబితాలో సంగారెడ్డి నియోజకవర్గం అభ్యర్థిగా రాజేశ్వర్ దేశ్ పాండే పేరును ప్రకటించారు.
దిశ , సంగారెడ్డి: బీజేపీ తుది జాబితాలో సంగారెడ్డి నియోజకవర్గం అభ్యర్థిగా రాజేశ్వర్ దేశ్ పాండే పేరును ప్రకటించారు. కానీ నామినేషన్ వేసే సమయానికి దేశ్ పాండేకి బదులుగా పులిమామిడి రాజు పేరును బీజేపీ అభ్యర్థిగా ప్రకటించారు. నామినేషన్ కేంద్రానికి వచ్చిన దేశ్ పాండే కు విషయం తెలియడంతో ఆందోళన నిర్వహించారు. తనకు మొదటగా సంగారెడ్డి టికెట్ కేటాయించి తరువాత ఇంకో వ్యక్తికి టికెట్ ఎలా కేటాయిస్తారంటూ మండిపడ్డారు. తనను ఎందుకు మోసం చేశారని తాను కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానంటూ రోడ్డుపై ఆందోళన చేపట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు నిలువునా నన్ను మోసం చేశారని నేను కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటే వారే బాధ్యులని హెచ్చరించారు.