కాంగ్రెస్ వస్తే కరువు, కర్ఫ్యూ : హరీష్ రావు
కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరువు, కర్ఫ్యూ లు లేవని,
దిశ, మెదక్ ప్రతినిధి : కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరువు, కర్ఫ్యూ లు లేవని, కాంగ్రెస్ కు అధికారం ఇస్తే రాష్ట్రంలో మళ్ళీ కరువు, కర్ఫ్యూ చూడాల్సిన దుస్థితి వస్తుందని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో గురువారం మెడికల్ కళాశాల కు శంకుస్థాపన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ తో కలిసి చేశారు. అనంతరం చర్చి గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో మంత్రి మాట్లాడారు.. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు.. ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకు వచ్చి దేశంలోనే ఆదర్శ రాష్ట్రం గా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ కు దక్కిందన్నారు.. కానీ మళ్ళీ మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఓట్ల కోసం వస్తున్నారని అన్నారు.వాటికి పొరపాటున అధికారం అప్పగిస్తే రాష్ట్ర ప్రజలు సుఖంగా బతకలేని అన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎప్పుడు కర్ఫ్యూ లతో గొడవలు, కరువుతో జనం విల విల విల వాడాల్సిన దుస్థితి వస్తుందని ఆరోపించారు.. బీ ఆర్ ఎస్ పార్టీ కాంగ్రెస్ కు బీ పార్టీ అని బీజేపీ అంటుంది, బీజేపీ కి బీ పార్టీ అంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. తాము యే పార్టీకి బీ పార్టీ కాదని, రాష్ట్ర ప్రజలకు మేమే ఏ పార్టీ అని అన్నారు. రెండు పార్టీలు రాష్ట్ర ప్రజల్ని మోసం చేశాయని ఆరోపించారు. ఢిల్లీ ను ఎదిరించి ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకొని దేశంలోనే ఆదర్శంగా నిలిపామని అన్నారు.రెండు పార్టీలకు ప్రతిపక్ష హోదా కూడా లేదని, రాబోయే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలో వస్తే ఇదిఅదీ ఇస్తామని హామీల వర్షం కురిపిస్తున్నారనీ అన్నారు.. కానీ మహిళల కోసం బీ ఆర్ ఎస్ తీసుకు వచ్చే పథకాలు ప్రతి పక్షాల మైండ్ బ్లాక్ అవుతాయని అన్నారు.
పెద్ద పెద్ద కార్ల లో డబ్బు సంచులతో గుండాల గ్యాంగ్ బయలు దేరిందని, గొర్రెల మందగా వస్తున్న వారితో జాగ్రత్త గా ఉండాలని చెప్పారు. మీ మధ్య ఉండే ఆడ బిడ్డ మెదక్ అభివృద్ధి కోసం మీ మధ్యనే ఉంది కృషి చేస్తుందని చెప్పారు. రైలు, మెడికల్ కళాశాల, జిల్లా కేంద్రం, కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల తో పాటు రోడ్లు ఇలా ఎన్నో అభివృద్ధి చేసిన ఘనత పద్మ కే దక్కిందన్నారు.. మరింత అభివృద్ది జరగాలంటే స్థానిక అడ బిడ్డ పద్మను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ గెలిస్తే జరిగిన అభివృద్ధి పెద్ద పాము మింగిన విధంగా మళ్ళీ అట్టడుగున మెదక్ నిలిచే ప్రమాదం ఉందని, ప్రజలు గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు, లావణ్య రెడ్డి, చంద్ర పాల్, మల్లికార్జున్ గౌడ్, సోములు, జిల్లా అధికారులు, ఇతర నేతలు, బారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.
మెదక్ జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాలకు రాష్ట్ర, ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి లతో కలిసి పలు అభివృద్ధి పనులకు గురువారం శంకుస్థాపన చేశారు. మెదక్ జిల్లా కలెక్టరేట్ లో గిరిజన సంక్షేమ శాఖ ఎరుకల సాధికారత పథకం ప్రారంభించారు. అలాగే 50 లక్షలతో సఖి కేంద్రం, జిల్లా గ్రంధాలయ భవనం తో పాటు మెడికల్ కళాశాల నిర్మాణం కు శంకుస్థాపన చేశారు...