మాటలే తప్ప చేతలు శూన్యం : హరీష్ రావు

సీఎం రేవంత్ రెడ్డి తీరుపై మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

Update: 2024-12-28 10:58 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి : సీఎం రేవంత్ రెడ్డి తీరుపై మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బ్రిడ్జ్ స్కూల్ విద్యార్థులకు స్వేటర్లు, దుప్పట్లు హరీష్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...సీఎం రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు గడప దాటడం లేదన్నారు. ఏ విషయం లో కూడా మాట నిలుపుకో లేదు...చెప్పిన మాటకు క్షేత్ర స్థాయిలో పొంతన లేదని మండిపడ్డారు. గ్రీన్ ఛానల్ ద్వారా మెస్ బిల్లులు చెల్లిస్తున్నట్లు అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారన్నారు. గ్రీన్ ఛానల్ ద్వారా మెస్ బిల్లులు చెల్లిస్తే 4 నెలలుగా పెండింగ్ లో ఎలా ఉన్నాయని సూటిగా ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి పరిపాలన మీద పట్టు కోల్పోయారని.. ప్రభుత్వం ఫెయిల్ అయినట్లు అనిపిస్తోందని అన్నారు. ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయడం లేదన్నారు. పెండింగ్ లో ఉన్న మెస్ చార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న సమస్యలు పరిష్కారం కావడం లేదని ఎద్దేవా చేశారు. 1వ తారీఖున జీతాలు అని సీఎం గొప్పలు చెప్పారని గుర్తు చేశారు. కానీ 10వ తారీఖు వరకు జీతాలు వేయడం లేదన్నారు. స్కూల్ విద్యార్థులకు దుప్పట్లు, స్వేటర్లు పంపిణీ చేసిన పవన సుత యూత్ వారిని అభినందించారు. యువత 31 ఫస్ట్ దావత్ బంజేసి.. హాస్టల్స్ దత్తత తీసుకోవాలని హరీష్ రావు పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Similar News