పుట్టింటికి వెళ్లిన భార్య రాలేదని భర్త ఆత్మహత్య
పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి రాలేదని మనస్తాపంతో భర్త ఉరేసుకుని ఆత్మహత్య పాల్పడిన ఘటన మండల పరిధిలోని చందాయిపేట గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది.
దిశ, చేగుంట: పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి రాలేదని మనస్తాపంతో భర్త ఉరేసుకుని ఆత్మహత్య పాల్పడిన ఘటన మండల పరిధిలోని చందాయిపేట గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. చేగుంట ఎస్సై ప్రకాష్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. చందాయిపేట గ్రామానికి చెందిన అవబోతు గణేష్ యాదవ్ (30) గ్రామంలోని సౌజన్య అనే యువతీతో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. మూడు నెలల క్రితం సౌజన్యకు ఆపరేషన్ జరగగా పుట్టింటి వద్దే ఉండిపోయింది. తిరిగి అత్తవారింటికి రాకపోవడంతో మనస్తపానికి గురైన గణేష్ శుక్రవారం ఉదయం నుంచి విపరీతంగా మద్యం సేవించాడు. మద్యం మత్తులో తాను పని చేస్తున్న తోటలోనే ఉరేసుకుని ఆత్యహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ఏరియా ఆసుపత్రి తరలించినట్లు ఎస్సై ప్రకాష్ గౌడ్ తెలిపారు.