కర్ణాటకలో కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయారు : హరీశ్ రావు

కర్ణాటకలో కాంగ్రెస్ ఐదు గ్యారెంటీలను నమ్మిన రైతుల గోసి ఊసిపోయిందని, తెలంగాణలో కాంగ్రెస్‌ను నమ్మి మోసపోవద్దు అని మంత్రి హరీష్ రావు అన్నారు.

Update: 2023-11-24 14:31 GMT

దిశ, నారాయణఖేడ్: కర్ణాటకలో కాంగ్రెస్ ఐదు గ్యారెంటీలను నమ్మిన రైతుల గోసి ఊసిపోయిందని, తెలంగాణలో కాంగ్రెస్‌ను నమ్మి మోసపోవద్దు అని మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం నారాయణఖేడ్ పట్టణంలో రైమన్ ఫంక్షన్ హాల్ నుంచి రాజీవ్ గాంధీ చౌరస్తా వరకు బీఆర్ఎస్ కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. ఖర్గే వచ్చి తెలంగాణ రాష్ట్రం మేం పెట్టిన భిక్ష అన్నాడు. మరి దేశానికి స్వాతంత్ర్యం కూడా బ్రిటీష్ వాళ్లు పెట్టిన భిక్షనా? అని విమర్శించారు. సొంత రాష్ట్రంలో నీళ్లు, రోడ్లు లేని ఖర్గే ఇక్కడికి వచ్చి నీతులు చెప్తున్నాడు అని ఆరోపించారు. కాంగ్రెస్‌కి ఓటేసి గెలిపించిన తర్వాత రాహుల్ గాంధీ జాడ లేడు, ప్రియాంకా గాంధీ పత్తా లేదు అన్నారు. రైతు బంధు మొదట రూ. 8 వేలు ఇచ్చి తర్వాత రూ. 10 వేలు చేసి ఇప్పుడు రూ. 16 వేలు చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చిండు అన్నారు. కాంగ్రెస్ వస్తే రైతు బంధు పోతది, కరెంట్ పోతది అని, నారాయణఖేడ్ ప్రజలు గుర్తు చేసుకోవాలన్నారు.

హస్తానికి ఓటేసి కర్ణాటక వాళ్లలాగా ఆగం అయిదామా?, కేసీఆర్ గెలిస్తే రూ. 2 వేల పెన్షన్ రూ. 5 వేలు అయితది. సన్న సోనామసూరి బియ్యం వస్తది అన్నారు. రిస్క్ వద్దనుకుంటే కారుకే ఓటు గుద్దాలి అని మంత్రి అన్నారు. ప్రజలు ఇదే ఉత్సాహాన్ని 30వ తేదీ వరకు దాచుకొని పోలింగ్ బూత్‌లో చూపించాలని తెలిపారు. నారాయణ ఖేడ్ రెవెన్యూ డివిజన్, పలు కొత్త మండలాల ఏర్పాటు, తండాలు గ్రామ పంచాయితీలు, డయాలసిస్ సెంటర్, వంద పడకల ఆసుపత్రి కేసీఆర్ హయాంలోనే వచ్చాయని తెలిపారు. రూ.110 కోట్లతో తండాలకు రోడ్లు వేశాం అని, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు వస్తుంది అన్నారు.

నారాయణ ఖేడ్ మున్సిపాలిటీకి రూ.50 కోట్లు కేటాయించి అభివృద్ధి చేశాం, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన భూములను పట్టా భూములుగా మారుస్తాం. కేసీఆర్ చెప్పింది చేశాడు అని, చెప్పనిది కూడా చేశాడు అన్నారు. ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ రాకముందు నారాయణఖేడ్ అన్ని రంగాలలో వెనుకబడి ఉండేదని, తెలంగాణ వచ్చినాక అన్ని రంగాలలో అభివృద్ధి జరిగిందన్నారు. మేజర్ పంచాయతీ ఉన్న నారాయణఖేడ్‌ను మున్సిపాలిటీగా ఏర్పాటు చేశామన్నారు. మున్సిపాలిటీ మంత్రి కేటీ ఆర్ సహకారంతో రూ. 50 కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. మూడు గంటలు కరెంటు ఇస్తామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని, కేసీఆర్ 24 కరెంటు ఇచ్చారన్నారు.

కాశీనాథ్ మందిర్, రామ్ మందిర్, వాక్సు బోర్డు భూములను కబ్జా చేశారన్నారు. ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి భూ కబ్జాలు చేశారని, కాంగ్రెస్ నాయకులు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని, నారాయణఖేడ్ పట్టణంలో మార్వాడి 99 ఎకరాలు లీజు తీసుకున్నారని, ఒకవేళ భూమి తీసుకోకపోతే ఎమ్మెల్యే అభ్యర్థి నుంచి తప్పుకుంటానని, కాంగ్రెస్ నాయకులు నిరూపించకుంటే మీరు తప్పుకుంటారా అని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పటేల్ , ఎమ్మెల్సీ రేవంత్, మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మోహిద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News