మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు
సిద్దిపేట నియోజకవర్గ వర్గం ప్రజలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.
దిశ, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట నియోజకవర్గ వర్గం ప్రజలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ… శివరాత్రి పర్వదినాన్ని ప్రజలంతా భక్తి శ్రద్ధలతో, ఆధ్యాత్మిక భావనతో ఉపవాసం ఉండి పవిత్రంగా జరుపుకుంటారన్నారు. పరమేశ్వరుని అనుగ్రహంతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని హరీష్ రావు ఆకాంక్షించారు.