TSPSC Group 1 2023 Prelims Exam on June 11

గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 11న జిల్లాలో 20 పరీక్షా కేంద్రాల్లో 7,786 మంది అభ్యర్థులు గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష రాయనున్నారు.

Update: 2023-06-09 10:48 GMT

20 పరీక్షా కేంద్రాలు.. పరీక్ష రాయనున్న 7,786 మంది

దిశ, సిద్దిపేట ప్రతినిధి : గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 11న జిల్లాలో 20 పరీక్షా కేంద్రాల్లో 7,786 మంది అభ్యర్థులు గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష రాయనున్నారు. పరీక్ష ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. అభ్యర్థులను పరీక్షా కేంద్రాలోనీకి 8:15 గంటల నుంచి అనుమతిస్తారు.10.15 తర్వాత విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. అదే విధంగా పరీక్షా కేంద్రంలోకి బ్యాగులు, సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, వాచ్లు, క్యాలిక్యులేటర్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించరు. అభ్యర్థులు తమ వెంట పరీక్షTSPSC Group 1 2023 Prelims Exam హాల్ టికేట్, పెన్ మాత్రమే తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు.

పట్టణంలోని ఇందూరు ఇంజనీరింగ్ కళాశాల, (బ్లాక్-E, 1-2), (బ్లాక్-C, 1-2), ప్రభుత్వ డిగ్రీ కాలేజ్( సెంటర్ ఎ, బీ, సీ), ఎస్.ఆర్.కే డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, జడ్పీహెచ్ఎస్( ఇంద్రానగర్), వికాస్ హై స్కూల్, బీఎంఆర్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల, శ్రీ చైతన్య ఈ -టెక్నో స్కూల్, విజ్వల జూనియర్ కాలేజ్, మాస్టర్ మైండ్ జూనియర్ కాలేజ్, ప్రతిభ జూనియర్ కాలేజ్, ప్రతిభ డిగ్రీ కాలేజ్, న్యూ జనరేషన్ జూనియర్ కాలేజ్, అంబిటస్ స్కూల్, తెలంగాణ స్టేట్ రెసిడెన్షి స్కూల్ అండ్ కాలేజ్ (ఏన్సాన్ పల్లి), ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ గర్ల్స్ హై స్కూల్, ప్రభుత్వ హై స్కూల్ (పారుపల్లి వీధి) పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష పోరపాట్లకు తావు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అభ్యర్థులు పరీక్షా సమయానికే రెండు గంట ముందే కేంద్రానికి చేరుకోని, ప్రశాంతంగా పరీక్షలు రాయాలని అధికారులు సూచించారు.

Tags:    

Similar News