MCD Clinic : పేదవాడిని కాపాడే బాధ్యత మన పై ఉంది.. మంత్రి దామోదర రాజనర్సింహ..
పేదవాడిని కాపాడుకునే బాధ్యత మన పై ఉందని ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
దిశ, నర్సాపూర్ : పేదవాడిని కాపాడుకునే బాధ్యత మన పై ఉందని ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మంగళవారం నర్సాపూర్ ఏరియా ఆసుపత్రిలో 50 లక్షల వ్యయంతో నిర్మించినడయాలసిస్ కేంద్రాన్ని ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే సునీత రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సాపూర్ ఏరియా ఆసుపత్రిలో 50 లక్షల వ్యయంతో ఐదు బెడ్లతో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. రాబోయే కాలంలో నర్సాపూర్ కు ఎన్సీడీ క్లినిక్ ఎమర్జెన్సీ హాస్పిటల్ ను నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రమాదాలు జరిగిన సమయంలో ఒక గంట గోల్డెన్ అవర్ ఉంటుందని ఆ గంటలోపు చికిత్స జరిగితే మనిషి బ్రతికే అవకాశం ఉందని దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎమర్జెన్సీ కేంద్రాన్ని మంజూరు చేస్తున్నట్టు తెలిపారు.
22 శాతం మంది వివిధ రోగాలతో బాధపడుతున్నారని అందులో క్యాన్సర్ డయాబెటిస్ హైపర్టెన్సు, హార్ట్ ఎటాక్ వంటివి పేద ప్రజలకు అర్థం కావని వారిని కాపాడే బాధ్యత ప్రభుత్వం పై ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సిబ్బంది వివిధ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆశ వర్కర్లు మంత్రికి సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. అంతకు ముందు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు మంత్రికి పూల బొకే ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఆర్డీవో మైపాల్, తహశీల్దార్ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ ఇన్చార్జి రాజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశం, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ రమణారావు, మాజీ కన్వీనర్ మల్లేష్ గౌడ్, నాయకులు మన్సూర్ సత్యం గౌడ్, రమేష్ గౌడ్ తదితరులు ఉన్నారు.