రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట : మెదక్ ఎమ్మెల్యే
రైతులు పండించిన సన్నరకం ధాన్యాన్ని ప్రోత్సహించేందుకు
దిశ, చిన్నశంకరంపేట : రైతులు పండించిన సన్నరకం ధాన్యాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఇందుకోసం క్వింటాలుకు రూ.500 బోనస్‌ను చెల్లిస్తుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. శుక్రవారం చిన్నశంకరంపేట మండలం కేంద్రంలో సహకార సంఘం సొసైటీ ద్వారా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, సూరారం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో శేరిపల్లి లో ఐకేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా 473 వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. "ఏ" గ్రేడ్ వరి ధాన్యానికి రూ.2320, సాధారణ రకానికి రూ. 2300, సన్నరకానికి బోనస్ క్వింటాలుకు రూ.500లను కలిపి రైతుకు చెల్లిస్తుందన్నారు. కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకొవాలని, కొనుగోలులో జాప్యం జరగకుండా జాగ్రత్తలు పాటించాలని నిర్వాహకులకు సూచించారు.
ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా చూసుకునే బాధ్యత అధికారులదేనని, ఎప్పటికప్పుడు అధికారుల పర్యవేక్షణ కూడా ఉండాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని, దళారుల వద్దకు వెళ్లి మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ సరస్వతి, డీపీఎం మోహన్, ఏపీఎం లక్ష్మీనారాయణ,సొసైటీ చైర్మన్ అంజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గంగా నరేందర్, ఆవుల గోపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ రాజిరెడ్డి, సొసైటీ కార్యదర్శి రమేష్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాన సత్యనారాయణ, మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, మేడి పెంటయ్య, మేడి నగేష్, సూరారం మాజీ సర్పంచ్ నీరజ పవన్ గౌడ్, మహిళా సమైక్య సంఘం అధ్యక్షుడు మాధవి, గ్రామ సంఘం అధ్యక్షుడు అనిత, తులసి, తో పాటు తదితరులు పాల్గొన్నారు.