గౌరవెల్లి ప్రాజెక్టును తొందరగా పూర్తి చేయాలి : మంత్రి హరీశ్ రావు
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గౌరవెల్లి ప్రాజెక్టును ఒక సదుద్దేశంతో మొదలు పెట్టారని, ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అధికార వర్గాలను ఆదేశించారు.
దిశ, సిద్దిపేట ప్రతినిధి : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గౌరవెల్లి ప్రాజెక్టును ఒక సదుద్దేశంతో మొదలు పెట్టారని, ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అధికార వర్గాలను ఆదేశించారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట క్యాంపు కార్యాలయంలో గురువారం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్ రెడ్డి, ఇరిగేషన్ ఈఈ రాములు, ఏజెన్సీ ప్రతినిధులతో కలిసి గౌరవెల్లి ప్రాజెక్టుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. తండా ప్రాంత వాసులైన గిరిజన నిర్వాసితులకు అందాల్సిన 21 కోట్ల రూపాయల నష్ట పరిహారం విషయమై ఏ ఒక్కరికీ అన్యాయం జరుగకుండా వీలైనంత త్వరగా అందించేలా ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ కు సూచించారు.