యోగాలోని నౌళి క్రియతో వినాయకుడు..
ఆనాడు పార్వతి దేవి పిండి బొమ్మ తో వినాయకుడు ఉద్
దిశ, చేగుంట : ఆనాడు పార్వతి దేవి పిండి బొమ్మ తో వినాయకుడు ఉద్ భావించినట్లుగా, నేడు యోగా విద్య లోని నౌళి క్రియతో వినాయకుడి ఆవిర్భావం. మానవుడు తన బాహ్య శరీర శుద్ధి చేసుకోవడం కంటే అంతర్ శరీరాన్ని శుద్ధి చేసుకోవడం వలన సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశం ఉంటుంది అని జీవన మంత్ర యోగ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ అల్లి నరేష్ పేర్కొన్నారు. మన పూర్వీకులు, మునులు అంత శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి యోగాలో షట్ క్రియలు పరిచయం చేశారు. (అవి దౌతి, బస్తీ, నేతి, నౌళి, త్రాటకం, కపాల భాతి ) వీటిని సాధన చేయడం ద్వారా ఎలాంటి రోగాలు దరిచేరకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశం ఉంటుందసి అల్లి నరేష్ తెలిపారు. వినాయక చవితిని పురస్కరించుకొని నౌళి క్రియతో వినాయకుడి రూపాని తన పొట్టపై వేయడం జరిగింది.