మాయ మాటలతో మహిళకు కుచ్చుటోపి
సైబర్ నేరస్థుడి మాయ మాటలను నమ్మి ఓ మహిళ మోసపోయిన ఘటన సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
దిశ, సిద్దిపేట ప్రతినిధి: సైబర్ నేరస్థుడి మాయ మాటలను నమ్మి ఓ మహిళ మోసపోయిన ఘటన సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళ బిట్ కాయిన్స్ గురించి అన్ లైన్ లో సర్ఛ్ చేసింది. ఈక్రమంలో అన్ లైన్ లోని ఓ ఫోన్ నెంబర్ ఫోన్ చేయడా గుర్తు తెలియని సైబర్ నేరస్తుడు చెప్పిన విధంగా బిట్ కాయిన్స్ రూ.1,20,000 పంపించింది. అనంతరం అతడికి ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆప్ వచ్చింది. దీంతో చేసేదేమి లేక బాధితురాలు జాతీయ సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. అపరిచిత వ్యక్తులను నమ్మి డబ్బులు పంపి మోసపోవొద్దని సూచించింది. సైబర్ నేరాల పట్ల ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.