కులమేదైనా, మతమేదైనా,దేశమేదైనా అందరూ సమానమే : ఎమ్మెల్యే హరీష్ రావు
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సీఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్
దిశ, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సీఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ... ప్రపంచంలోనే అతి ఎక్కువ మంది జరుపుకునే పండుగ క్రిస్మస్ అన్నారు. తోటి వారిని ప్రేమించి వారికి సహాయం చేయడంతోనే జన్మ ధన్యమవుతుందని ఏసు భోధన ల సారాంశం అన్నారు. క్రిస్మస్ పండుగను రాష్ట్ర పండుగగా జరిపిన ఒకే ఒక్క వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్ల పాటు క్రిస్మస్ తోఫాను అందించినట్లు గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం క్రిస్మస్ తోఫా ను కొనసాగించలేదు అన్నారు. కులమేదైనా, మతమేదైనా దేశమేదైనా అందరూ సమానమే అన్నారు.
కొంతమంది వ్యక్తులు కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెట్టి మనల్ని విడదీస్తున్నారని పేర్కొన్నారు. విజ్ఞులైన మనమందరం ఒక్కటిగానే ఉండి, ఈ దేశ, రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం సిద్దిపేట లయన్స్ క్లబ్, అభయ జ్యోతి వారి ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ పీ ఎల్ అధ్యక్షుడు లయన్స్ క్లబ్ డిస్టిక్ చైర్మన్ వినోద్ మోదాని తో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కౌన్సిలర్ అడగట్ల కావేరి అంజి, బీఆర్ఎస్ నాయకుడు అడగట్ల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.