లింగాయత్ కార్పొరేషన్ ఏర్పాటుతో బలిజ సమాజానికి ఎంతో మేలు

లింగాయత్ కార్పొరేషన్ ఏర్పాటుతో వీరశైవ లింగాయత్ బలిజ సమాజానికి ఎంతో మేలు చేకూరుతుందని వీరశైవ లింగ బలిజ సమాజం జిల్లా గౌరవ అధ్యక్షుడు శివప్ప, వీరశైవ లింగ బలిజ సమాజం అధ్యక్షుడు యాదగిరి అన్నారు.

Update: 2024-03-13 12:18 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి : లింగాయత్ కార్పొరేషన్ ఏర్పాటుతో వీరశైవ లింగాయత్ బలిజ సమాజానికి ఎంతో మేలు చేకూరుతుందని వీరశైవ లింగ బలిజ సమాజం జిల్లా గౌరవ అధ్యక్షుడు శివప్ప, వీరశైవ లింగ బలిజ సమాజం అధ్యక్షుడు యాదగిరి అన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ… ఎన్నో ఏళ్ళుగా లింగాయత్ కార్పొరేషన్ ఏర్పాటుకు డిమాండ్ ఉన్నప్పటికీ ఏ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. లింగాయత్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం చొరవ చూపిన సురేష్ షెట్కర్, సహకరించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, భట్టి విక్రమార్కలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఆర్థికంగా వెనుకబడి ఉన్న లింగాయత్ కుటుంబాలకు కార్పొరేషన్ ద్వారా లబ్ధి చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా గుడిమెట్ల నుంచి కొలనుపాక వరకు జరిగే రేణుక చారి జయంతి పాదయాత్ర ఈనెల 19న సిద్దిపేటకు చేరుకుంటుందన్నారు. ఈ మేరకు సిద్దిపేట కోటిలింగేశ్వర ఆలయంలో మహా స్వామి ప్రవచనాలు కార్యక్రమం ఉంటుందన్నారు. వీరశైవ లింగాయత్ ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లింగ బలిజ సమాజం నాయకులు శివకుమార్,రాజమౌళి, నాగరాజు, అరుణ్, శ్రీనివాస్, అనిల్, రంజిత్, బద్రి పలువురు పాల్గొన్నారు.


Similar News