మొదటి ర్యాండమైజేషన్ పూర్తి

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ సిబ్బంది మొదటి రాండమైజేషన్ పూర్తి చేసినట్లు సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.

Update: 2024-03-26 13:09 GMT

దిశ, సంగారెడ్డి : లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ సిబ్బంది మొదటి రాండమైజేషన్ పూర్తి చేసినట్లు సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. జిల్లా కలెక్టరేట్ లో ఎన్ఐసీ, వీసీ హాల్‌లో మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించి పూర్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…. జిల్లాలోని పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులను పోలింగ్ కేంద్రాలకు సంబంధించి మొత్తం 8363 మందిని మొదటి విడత ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ సిబ్బందిని కేటాయించడం జరిగిందన్నారు. అందులో ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ అధికారులున్నారని తెలిపారు. ర్యాండమైజేషన్ ద్వారా నియమించిన వారికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారిణి పద్మజా రాణి , జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు , డీఐఓ-ఎన్ఐసీ జి.విద్యాసాగర్ , ఎన్నికల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Similar News