దిశ కథనానికి స్పందన.. పేద విద్యార్థికి ఆర్థిక సాయం..

Update: 2024-08-15 15:49 GMT

దిశ, నిజాంపేటః "నిరుపేద విద్యార్థికి జేఈఈ మెయిన్స్ లో ఉత్తమ ర్యాంకు సాధించినప్పటికీ పై చదువులు చదివించే స్థోమత తమ కుటుంబానికి లేదని గత కొన్ని రోజుల క్రితం దిశలో కథనం ప్రచురుదతమైంది". మండల పరిధిలోని చల్మెడ గ్రామానికి చెందిన రాగుల సాయికుమార్‌ కు జేఈఈ మెయిన్స్‌ లో ఉత్తమ ర్యాంకు సాధించాడనే వార్తను దిశలో ప్రచురించగా.. దీనికి క్యాప్షన్‌ సెక్యూరిటీ వారు నంద్యాల చంద్రారెడ్డి మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో లాప్‌ టాప్‌ను అందించారు. అతనికి రూ.70000 విలువచేసే లాప్‌ టాప్‌ అందించారు. ఈ సందర్భంగా నంద్యాల నర్సింహ్మరెడ్డి మాట్లాడుతూ రాగుల సాయికుమార్‌ జెఈఈ మెయిన్స్‌ మంచి ర్యాంక్‌ సాదించి ఆర్థిక ఇబ్బందులతో వెనకడుగు వేయడంతో అతనిని ముందుకు తీసుకవెళ్ళడానికి అతని సహాయం చేసిన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల నరసింహారెడ్డి , రాగుల బాబు, నంద్యాల చంద్రారెడ్డి మెమోరియల్‌ ట్రస్ట్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News