యూరియా కోసం రైతులు ఆందోళన
దిశ, దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని ఫర్టిలైజర్
దిశ, దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణాల వద్ద ఉదయం 6గంటలకే రైతులు యూరియా కోసం క్యూలైన్ కట్టారు. గత 20 రోజులుగా యూరియా కోసం రైతులు ఎరువుల దుకాణాల చుట్టూ తిరుగుతున్నామని, దుకాణాల యజమానులు మాత్రం తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ తమకు నచ్చిన వారికి యూరియాను విక్రయిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రైతులకు సలహాలు సూచనలు అందించవలసిన AEO లు, వ్యవసాయ అధికారులు ఎక్కడ పని చేస్తున్నారో తమకు అర్థం కావడం లేదని ఆరోపించారు. దుకాణాల వద్దకు యూరియా లారీలు వస్తే యజమానులు మాత్రం తమకు ఇష్టం వచ్చిన వారికి చిట్టీలు రాసి ఇస్తూ రైతులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇప్పటికైనా వ్యవసాయ శాఖ అధికారులు ఈ సమస్యను పరిష్కరించి రైతులను ఆదుకోవాలన్నారు. రైతులకు సరిపడే యూరియా సరఫరా చేయకపోతే రైతులమంత కలిసి రోడ్లపై ఆందోళన చేయాల్సి వస్తుందని రైతులు అధికారులను హెచ్చరించారు.