మూల్యాంకన కేంద్రాల్లో వసతులు కల్పించాలి
మూల్యాంకన కేంద్రాల్లో వసతులు కల్పించాలని కోరుతూ మంగళవారం ఇంటర్ విద్యాధికారి సూర్య ప్రకాష్‌కు తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు.
దిశ, సిద్దిపేట ప్రతినిధి : మూల్యాంకన కేంద్రాల్లో వసతులు కల్పించాలని కోరుతూ మంగళవారం ఇంటర్ విద్యాధికారి సూర్య ప్రకాష్‌కు తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గిరి రవి, ప్రధాన కార్యదర్శి దరిపల్లి నగేష్, రాష్ట్ర అధికార ప్రతినిధి నంట శ్రీనివాస్ రెడ్డిలు మాట్లాడుతూ… మూల్యాంకన కేంద్రాల్లో సరైన వసతులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఫ్యాన్లు, ట్యూబులైట్లు తదితర వసతుల కల్పనకు మూల్యాంకన కేంద్రాలకు వెంటనే నిధులు కేటాయించాలని కోరారు. మూల్యాంకనం క్యాంప్ పూర్తయిన వెంటనే మూల్యాంకన డబ్బులు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ , భీమ్రావు , సదానందం, భాగ్యలక్ష్మి, స్వప్న, జిల్లా ఉపాధ్యక్షుడు కే యాదగిరి, గోపాల్, శ్రీకాంత్, లక్ష్మీ ప్రసాద్, వేణుగోపాల్, రాజా రమణ, మధు , వెంకటరమణ, వేణుగోపాల్, శ్రీకాంత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.