పారిశుద్ధ్య కార్మికులందరికీ ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలి

జిల్లాలోని పారిశుద్ధ్య కార్మికులందరికీ ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కోసం వెంటనే దరఖాస్తు చేయించాలని జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ చైర్మన్ పీపీ వావాజీ అన్నారు.

Update: 2024-03-12 15:29 GMT

దిశ, సంగారెడ్డి : జిల్లాలోని పారిశుద్ధ్య కార్మికులందరికీ ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కోసం వెంటనే దరఖాస్తు చేయించాలని జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ చైర్మన్ పీపీ వావాజీ అన్నారు. మంగళవారం కలెక్టరెట్ సమావేశ మందిరంలో కార్మికుల సమస్యల తెలుసుకోవడం కోసం జిల్లా స్థాయి అధికారులు, పారిశుద్ధ్య కార్మికులతో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలోని అర్హులైన కార్మికులందరికి పీఎఫ్, ఇఎస్‌ఐ అప్డేట్ చేయాలన్నారు. కోవిడ్ సమయంలో సేవలు అందించిన సఫాయి కర్మ చారులను ఆయన అభినందించారు. అవుట్ సోర్సింగ్ ద్వారా సకాలంలో జీతాలు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. సఫాయి కర్మ చారులకి వెంటనే ఐడెంటిటీ కార్డులను అందజేయాలన్నారు. మూడు నెలలకు ఒక సారి కర్మచారులకు వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. రిటైర్మెంట్ అయిన సఫాయి కర్మచారులకు ఉద్యోగుల బెనిఫిట్స్ పూర్తిగా చెల్లించాలి అని అధికారులను ఆదేశించారు. సఫాయి కర్మా చారుల కారుణ్య నియామకాలను పెండింగ్‌లో ఉంచొద్దని అధికారులకు సూచించారు. పారిశుద్ధ్య సివరేజ్ పనులు చేస్తూ ప్రమాదాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం అందించాలన్నారు.

అట్రాసిటీ కేసుల వివరాలు కమిషన్‌కు వెంటనే అందించాలి అని ఆదేశించారు. అట్రాసిటీ కేసులలో త్వరగా న్యాయం జరిగే జిల్లా చూడాలని ఆదేశించారు. సపోర్టింగ్ స్కీమ్ ల ద్వారా సఫాయి కర్మచారులకు బ్యాంకు రుణాలు ఇవ్వాలన్నారు. టాయిలెట్ కాంట్రాక్టు‌లలో సఫాయి కర్మచారుల కుటుంబాలకు ప్రాథ్యన్యత ఇవ్వాలి అని, పీఎం ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్, గృహలక్ష్మి పథకలలో సఫాయి కర్మఛారుల కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో సలహాదారుడు వీరేంద్రనాథ్,అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, సాంఘిక సంక్షేమాధికారి రామాచారి , సంబంధిత జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Similar News