25 వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలు : పోలీస్ కమిషనర్ శ్వేత

పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 25 వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ శ్వేత తెలిపారు. కమిషనరేట్ పరిధిలో ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని తెలిపారు.

Update: 2023-05-17 11:34 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి : పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 25 వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ శ్వేత తెలిపారు. కమిషనరేట్ పరిధిలో ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని తెలిపారు. కార్యక్రమాల నిర్వహణకు ముందుగా పోలీస్ అధికారుల అనుమతి తీసుకోవాలన్నారు. బంద్ ల పేరిట వివిధ కారణాలు చూపుతూ బలవంతంగా సంస్థలు, కార్యాలయాలను మూసి వేయాలని ఒత్తిడి, బెదిరింపులకు గురిచేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని పోలీస్ కమిషనర్ సూచించారు. ఇందుకు తోడు కమిషనరేట్ పరిధిలో డీజే సౌండ్ వినియోగంపై నిషేధాజ్ఞలు 25 వరకు అమలులో ఉంటాయని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామని సీపీ శ్వేత హెచ్చరించారు.

.Also Read..

నకిలీ విత్తనాలు అమ్మితే.. పీడీ యాక్ట్ నమోదు చేస్తాం : ఎస్పీ ఎగ్గడి భాస్కర్. 

Tags:    

Similar News