విద్యుత్ ఉద్యోగులు.. తస్మాత్ జాగ్రత్త : మంత్రి హరీష్ రావు

విద్యుత్ ఉద్యోగులు తస్మాత్ జాగ్రత్త... బీజేపీ ప్రైవేట్ కత్తి వేలాడుతోందని, ఆ పార్టీకి మద్దతిస్తే ప్రైవేట్ పరం తప్పదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు హెచ్చరించారు.

Update: 2023-06-05 10:33 GMT

మెడపై బీజేపీ ప్రైవేట్ కత్తి..

విద్యుత్ పోరాటం నుంచే తెలంగాణ ఉద్యమం

దిశ, మెదక్ ప్రతినిధి : విద్యుత్ ఉద్యోగులు తస్మాత్ జాగ్రత్త... బీజేపీ ప్రైవేట్ కత్తి వేలాడుతోందని, ఆ పార్టీకి మద్దతిస్తే ప్రైవేట్ పరం తప్పదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు హెచ్చరించారు. మెదక్ జిల్లా కేంద్రంలో విద్యుత్ సంబరాల్లో భాగంగా విద్యుత్ శాఖ ప్రగతిపై నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. అంధకారంగా తెలంగాణ మారుతుందన్న విమర్శల నుంచి 24 గంటల విద్యుత్ అందించే స్థితికి తెలంగాణ వచ్చిందంటే సీఎం కేసీఆర్ కృషి ఎంత ఉందో ఉద్యోగుల శ్రమ అంతే ఉందన్నారు.

కానీ, బీజేపీని నమ్మితే మాత్రం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇప్పటికీ పలు సంస్థలను ప్రైవేట్ పరం చేసిన కేంద్రం విద్యుత్ ఉద్యోగులపై కూడా ప్రైవేట్ కత్తి వెలాడుతుందని ఆరోపించారు. ఆ పార్టీని నమ్మితే విద్యుత్ సంస్థను కూడా ప్రైవేట్ పరం చేస్తుందని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో విద్యుత్ ను ప్రైవేట్ పరం చేసి చేతులు కాల్చుకుందని విమర్శించారు. చంద్రబాబు పెంచిన విద్యుత్ చార్జీల నుంచే తెలంగాణ ఉద్యమం పుట్టిందన్నారు. బిల్లులు కట్టకపోతే స్టార్టర్ వ్యవసాయ పొలాల వద్ద స్టార్టర్ డబ్బాలు ఎత్తుకు పోయారని తెలిపారు.

పెంచిన చార్జీలపై పోరాటం చేసిన రైతులపై తూటాలు దించి నలుగురిని బలి తీసుకున్నాడని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఎప్పుడూ వస్తుందో ఎప్పుడూ తెలియని పరిస్థితి ఉండేదన్నారు. కాంగ్రెస్ పాలనలో ఫ్యాక్టరీలు పవర్ హాలిడే వారానికి మూడు రోజులు ప్రకటించారని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, ఎస్.ఈ జానకిరాం, డీఈ కృష్ణ మూర్తి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లిఖార్జున్ గౌడ్, ఎంపీపీ నారాయణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Also Read:   వైద్యమో.. రామచంద్రా..! 

Tags:    

Similar News