రేకుల ఇంటికి వేలాది రూపాయల కరెంటు బిల్లు..

రేకుల ఇంటికి ప్రతి నెల కరెంటు బిల్లు వేల రూపాయల్లో వస్తుండడంతో ఓ కుటుంబం ఆందోళన చెందుతుంది.

Update: 2023-05-26 10:58 GMT

దిశ, చేగుంట : రేకుల ఇంటికి ప్రతి నెల కరెంటు బిల్లు వేల రూపాయల్లో వస్తుండడంతో ఓ కుటుంబం ఆందోళన చెందుతుంది. మండల పరిధిలోని పోతాను పల్లి గ్రామానికి చెందిన గూళ్ళ లక్ష్మీ, నర్సింహులు అనే కుటుంబ సభ్యులు తమ ఇల్లు 3-6 ఇంటి నంబర్లు 734 సర్వీస్ నెంబర్ తో కరెంటు మీటర్ తీసుకుని విద్యుత్తును వాడుకుంటున్నారు. పురాతనమైన ఇంటిని కూల్చివేసి అదే స్థానంలో రేకులతో ఇల్లు నిర్మించుకోగా కరెంటు బిల్లు కాస్త వందల నుండి వేల రూపాయలకు జంప్ అయింది.

పాత పెంకుటిల్లు భారీ వర్షం పడితే కూలే పరిస్థితిలో ఉండడంతో ఈ మధ్యనే ఆ ఇల్లు కూల్చేసి రేకుల ఇల్లు కట్టుకుని ఉంటున్నారు. గుల్ల లక్ష్మి , ఆమె భర్త నర్సింలు ఇద్దరు కూడా జాతీయరహదారి పై తాత్కాలిక పని పై పనిచేస్తున్నారు. రోజువారి ఆదాయమే వారికి ఆధారం. వందల రూపాయల కరెంటు బిల్ వేల రూపాయలు వస్తుండడంతో ఆందోళన చెంది విద్యుత్ సిబ్బందిని ఇంటి యజమానులు నిలదీశారు. అప్పటినుండి వీళ్ళ కరెంట్ బిల్లు 1000/-పైనే వస్తుంది. ఎక్కువగా బిల్లు వస్తుందని సంబంధిత బిల్ కలెక్టరును అడిగితే అనుకోకుండా జరిగింది. సరిచేస్తా అని చెప్పి రెండు నెలల బిల్లు కూడా కట్టించుకున్నాడు. రెండు నెలల బిల్లు కట్టిన తర్వాత వేల రూపాయల బిల్లువస్తుండడంతో కట్టకుండా ఉండిపోయారు. ఇప్పుడు వాళ్ళ బిల్లు ఏడువేల పై ఉంది.

ఇప్పుడు ఈ బిల్లు ఎవరు చెల్లించాలి.. దీనికి బాధ్యులు ఎవరు..?

కుటుంబ గడవటానికే కూలికి వెళ్ళే వాళ్ళు నెలనెలా వేయి రూపాయల కరెంట్ బిల్లు ఎలా కడతారు. విద్యుత్ సిబ్బంది వల్ల జరిగిన తప్పిదంతో ఒకటవ కేటగిరి లో ఉండాల్సిన ఇంటి మీటర్ రెండవ కేటగిరీకి మారిపోవడంతో వందల్లో రావాల్సిన కరెంటు బిల్లు వేల రూపాయలకు చేరిపోయింది. ఇప్పటికైనా విద్యుత్ సిబ్బంది, గ్రామ ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని తప్పుగా నమోదైన కరెంటు మీటర్ను సరిచేసి వారిపై పడే అదనపు భారాన్ని తగ్గించాల్సిందిగా గ్రామస్తులు కోరుతున్నారు.

అమాయక ప్రజలపై కరెంటు చార్జీల పెంపు.. సామాజిక కార్యకర్త గడ్డం కోటేష్..

ఏ మాత్రం అవగాహన లేని అమాయక ప్రజల పై విద్యుత్ సిబ్బంది చార్జీలు మోపి ముక్కు పిండి వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. కరెంటు బిల్లు కట్టకపోతే కనెక్షన్ కట్ చేస్తామని సిబ్బంది ఇబ్బంది చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా గూళ్ళ లక్ష్మీనరసింహుల బాధను అర్థం చేసుకొని వారికి న్యాయం చేయాలని కోరారు.

Tags:    

Similar News