పోరాట వారసత్వ చిహ్నం ఐలమ్మ: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు

పోరాటాల చరిత్రకు వారసత్వ చిహ్నంగా చాకలి ఐలమ్మ నిలిచిపోతుందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్...Dubbhaka MLA Raghunandhan rao Comments

Update: 2022-11-26 10:32 GMT

దిశ, చేగుంట: పోరాటాల చరిత్రకు వారసత్వ చిహ్నంగా చాకలి ఐలమ్మ నిలిచిపోతుందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పేర్కొన్నారు. మండల పరిధిలోని వడియారం గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహానికి శనివారం పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా మొదలైందని గ్రామ గ్రామాన కొమరం భీమ్, చాకలి ఐలమ్మలు తెలవనివారు లేరంటే అతిశయోక్తి కాదని పేర్కొన్నారు.

ఆనాటి దొరల పాలనకు, నిజాం నిరంకుషాత్వానికి వ్యతిరేకంగా గళం విప్పి పోరాటం చేసిన వీరవనిత చాకలి ఐలమ్మ అంటూ కొనియాడారు. వడియారంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి ఎమ్మెల్యే రఘునందన్ రావుతోపాటు బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వడియారం రజక సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రఘునందన్ రావును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వడియారం రజక సంఘం అధ్యక్షులు పాండు, మండల శాఖ అధ్యక్షులు రామచంద్రం, గ్రామ నాయకుడు డాక్టర్ స్వామి, బీజేపీ మండల శాఖ అధ్యక్షులు భూపాల్, నియోజకవర్గ కోకన్వీనర్ గోవింద్ కృష్ణ, బీజేపీ సీనియర్ నాయకుడు నందు జనార్దన్ రెడ్డితోపాటు బీజేపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Tags:    

Similar News