చెర్లపల్లి జైల్లో కేసీఆర్‌కు డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తా : రేవంత్ రెడ్డి

దుబ్బాక అభివృద్ధి పథంపై నడవాలంటే డిసెంబర్ 30న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి చెరుకు శ్రీనివాస్ రెడ్డిని గెలిపించుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.

Update: 2023-11-23 10:57 GMT

దిశ, దుబ్బాక: దుబ్బాక అభివృద్ధి పథంపై నడవాలంటే నవంబర్ 30న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి చెరుకు శ్రీనివాస్ రెడ్డిని గెలిపించుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. లక్షల కోట్లు స్వాహా చేసిన కేసీఆర్‌ను చర్లపల్లి జైలుకి పంపడం ఖాయమని రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభలో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. దుబ్బాక అంటే ఉమ్మడి అంధ్రప్రదేశ్ నుంచి  నేటి తెలంగాణ ఏర్పాటు వరకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఈ ప్రాంతం నుంచి వచ్చిన నాయకులు మాజీమంత్రి దివంగత చెరుకు ముత్యం రెడ్డి దుబ్బాక గడ్డ కోసం ఎంతో కృషి చేశారని, ఉమ్మడి రాష్ట్రంలోనే దుబ్బాకకు రావలసిన నిధులు సిద్దిపేటకు తీసుకువెళ్తున్నప్పుడు ముత్యంరెడ్డి హాయంలోనే తిరిగి దుబ్బాకకు నిధులు సమకూర్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశాడని గుర్తుచేశారు.

ఈ ఎన్నికలలో కేసీఆర్‌ను బోంద పెడితే రూ. 4వేల పెన్షన్ ఇస్తాం. 10 ఏళ్లలో కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కానీ వేయ్యి ఎకరాల్లో ఫామోస్, పంజాగుట్టలో 15 వందల ఇళ్లు కట్టుకున్నాడని ఆరోపించారు. లక్ష కోట్లు అక్రమంగా సంపాదించుకున్న కేసీఆర్ చిట్టాలను తాము అధికారంలోకి వచ్చాక బయటపెట్టి చర్లపల్లి జైలుకు పంపిస్తామన్నారు. అలాగే నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వని కేసీఆర్ కి తాము డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని అందులో అతడి అల్లుడు హరీష్ రావు, కొడుకు కేటీఆర్, బిడ్డ కవితకు కూడా ఉండేలా చూస్తామని ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News