'వెల్ఫేర్ బోర్డును ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వొద్దు..'

తెలంగాణ భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డులో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను టెండర్ ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించాలనే ప్రతిపాదనను విరమించుకోవాలని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చొప్పరి రవికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Update: 2024-09-18 13:57 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి : తెలంగాణ భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డులో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను టెండర్ ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించాలనే ప్రతిపాదనను విరమించుకోవాలని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చొప్పరి రవికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెల్ఫేర్ బోర్డులో నిధులు దుర్వినియోగం కాకుండా కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేయాలన్నారు.

రాష్ట్రంలో 25 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉండగా 15 లక్షల మందికి రెన్యువల్ చేసి మిగిలిన 10 లక్షల మంది కార్మికులకు సంక్షేమ పథకాలు వర్తించకుండా అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చే సందర్భంలో కార్మిక సంఘాల నాయకులు, మేధావులు, అనుభవం కలిగిన నిపుణులతో చర్చించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు పోతిరెడ్డి రాజు, నాగరాజు, జిల్లా కమిటీ సభ్యులు కనక స్వామి, బాల నరసయ్య, బాలకిషన్, మల్లేశం, రాజశేఖర్, లక్ష్మి, కాంతమ్మ, వినోద, రేణుక, ఎల్లమ్మ, రాజు తదితరులు పాల్గొన్నారు.


Similar News