Police Commissioner : రోడ్లపై ధాన్యాన్ని పోసి ఇతరుల మరణాలకు కారణం కావద్దు
రోడ్లపై ధాన్యాన్ని ఎండ పోసి ఇతరుల మరణానికి కారణం కావద్దని పోలీస్ కమిషనర్ డా. అనురాధ అన్నారు.
దిశ, సిద్దిపేట ప్రతినిధి: రోడ్లపై ధాన్యాన్ని ఎండ పోసి ఇతరుల మరణానికి కారణం కావద్దని పోలీస్ కమిషనర్ డా. అనురాధ అన్నారు. రోడ్లపై ధాన్యాన్ని పోసి నల్ల కవర్ కప్పడం వల్ల ధాన్యం కుప్ప కనపడక వాహనదారులు ఢీకొని చనిపోయిన సంఘటనలు జిల్లాలో చోటు చేసుకున్నట్లు తెలిపారు. బావి దగ్గర, ఇండ్ల వద్ద లేదా ఇతర ప్రదేశాలలో ధాన్యం ఆర పెట్టుకోవడానికి ఏర్పాటు చేసుకోవాలన్నారు. నిర్లక్ష్యంగా రోడ్లపై ధాన్యం పోసి అమాయక ప్రజల ప్రాణాలు పోవడానికి కారణం కావద్దు అన్నారు. పోలీస్ అధికారులు సిబ్బంది కూడా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎవరైనా ధాన్యాన్ని రోడ్లపై నిర్లక్ష్యంగా పోస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.