పకడ్బందీగా సామాజిక సర్వే.. కలెక్టర్ రాహుల్ రాజ్..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సామాజిక సమగ్ర కుటుంబ సర్వేను బుధవారం మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు.

Update: 2024-11-13 13:06 GMT

దిశ, నిజాంపేట : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సామాజిక సమగ్ర కుటుంబ సర్వేను బుధవారం మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఈ మేరకు రామాయంపేట మున్సిపాలిటీ పదొవ వార్డులో నిర్వహిస్తున్న సామాజిక సర్వేను ఆయన పరిశీలించి ఎలాంటి తప్పులు లేకుండా పకడ్బందీగా సర్వేను నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి వివరాలను సేకరిస్తారన్నారు.

సర్వేలో సేకరించిన వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు. సర్వే పై ఎలాంటి అపోహలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా సర్వే 20% నుండి 30% వరకు పూర్తయిందన్నారు. పట్టణ, గ్రామాలలో ప్రజలు సర్వే అధికారులకు సహకరించి వారి వివరాలను తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్ రజనీకుమారి, ఆర్ఐ గౌసుద్దీన్, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, సూపర్వైజర్ శ్రీధర్ రెడ్డి, శివరాజ్, కవిత అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News