ఏళ్లు పాలించిన వారికి ప్రాజెక్ట్ లు నిర్మించాలని తెలీదా.. : ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి

రాష్ట్రాన్ని ఏళ్లుగా పాలించిన నేతలకు రైతుల కోసం ప్రాజెక్ట్ లు, చెక్ డ్యాం నిర్మించాలన్న ఆలోచన ఎందుకు రాలేదని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రశ్నించారు.

Update: 2023-06-07 10:26 GMT

దిశ, మెదక్ ప్రతినిధి : రాష్ట్రాన్ని ఏళ్లుగా పాలించిన నేతలకు రైతుల కోసం ప్రాజెక్ట్ లు, చెక్ డ్యాం నిర్మించాలన్న ఆలోచన ఎందుకు రాలేదని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రశ్నించారు. మెదక్ మండలం ర్యాలమడుగు చెక్ డ్యాం వద్ద సాగు నీటి దినోత్సవం నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడీ, అదనపు కలెక్టర్ రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా పంట భూములు బీడు భూములుగా మారాయని ఆరోపించారు.

సమైక్య పాలనలో రైతులకు సాగు నీరందించేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదన్నారు. ఉన్న రెండు మూడు ప్రాజెక్ట్ లు మినహా పెద్దగా ప్రాజెక్ట్ లు లేకపోవడం వల్ల రాష్ట్రంలో సాగు నీటికి సంక్షోభం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఉన్న ఏకైక సింగూర్ ప్రాజెక్ట్ నుంచి ఘనపూర్ ప్రాజెక్ట్ కు సాగు నీరు కావాలంటే ఎమ్మెల్యేలకు నమస్తే పెట్టాల్సి వచ్చేదన్నారు. రైతులంతా కలిసి మంత్రి వద్దకు వెళ్లి మత్రి మెట్రోపాలిటన్ అనుమతి కోసం రాసి అన్ని పూర్తయ్య సరికే పంట ఎందిపోయేదన్నారు. కానీ, రైతు కష్టం తెలిసిన సీఎం కేసీఆర్ హైదరాబాద్ కు గోదావరి జలాలు అందించి సింగూర్ నీటిని జిల్లా ప్రజల సాగు, తాగుకు వినియోగిస్తున్నారని తెలిపారు.

మెదక్ జిల్లాలో మిషన్ కాకతీయలో 1,870 చెరువుల మరమ్మతు చేయగా, నియోజకవర్గంలో 484 చెరువులు, కుంటలు మరమ్మతు చేశారని తెలిపారు. సాగు, తాగు నీటితో పాటు సంక్షేమ పథకాలను అందిస్తున్న పేదల పక్షపాతి సీఎం కేసీఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, అదనపు కలెక్టర్ రమేష్, ఇరిగేషన్ ఎస్ఈ ఈశయ్య, డీఈ నాగరాజు, ఎంపీపీ యమునా జయరాం రెడ్డి, పాక్స్ చైర్మన్ హన్మంత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, సర్పంచ్ రజనీ భిక్షపతి, కౌన్సిలర్లు బీమరి కిషోర్, జయరాజ్, లక్ష్మీనారాయణ గౌడ్, ముత్యం గౌడ్, సాంబశివరావు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News