డైనమిక్ ఎడిషన్లతో..దిశ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది : హరీష్ రావు
ప్రజలకు ఎప్పటికప్పుడు వార్తలు అందించడం కోసం డైనమిక్ ఎడిషన్లతో దిశ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు స్పష్టం చేశారు.
దిశ, సిద్దిపేట ప్రతినిధి : ప్రజలకు ఎప్పటికప్పుడు వార్తలు అందించడం కోసం డైనమిక్ ఎడిషన్లతో దిశ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో దిశ దిన పత్రిక 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను దిశ జిల్లా ప్రతినిధి తిప్పర్తి భాస్కర్, దిశ చిన్నకోడూరు విలేఖరి పుప్పాల బాలేష్, దిశ సిద్దిపేట అర్బన్ మండల విలేఖరి బండోజి సిద్దయ్య తో కలిసి ఎమ్మెల్యే హరీష్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ.. నిష్పక్షపాతంగా వార్తలను ప్రచురిస్తూ దిశ దిన పత్రిక అనతి కాలంలోనే ప్రజలకు చేరువ అయిందని అన్నారు. వాస్తవాలను ప్రజలకు నిర్భయంగా తెలియజేయడంలో దిశ దిన పత్రిక ముందు వరసలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి, పాల సాయిరాం, మామిండ్ల ఐలయ్య, లక్కరసు ప్రభాకర్ వర్మ, గుండు భూపేష్ తదితరులు పాల్గొన్నారు.