‘దిశ’ ఎఫెక్ట్..కాలుష్య నియంత్రణ అధికారుల తనిఖీ

గురువారం దిశలో ప్రచురితం అయిన "పారా బాయిల్డ్ మిల్లులతో పరేషాన్"

Update: 2024-11-20 04:19 GMT

దిశ,కంగ్టి : గురువారం దిశలో ప్రచురితం అయిన "పారా బాయిల్డ్ మిల్లులతో పరేషాన్" కథనంపై మంగళవారం కాలుష్య నియంత్రణ అధికారి ఏఈ పద్మ ఆధ్వర్యంలో తడ్కల్ సమీపంలోని మిల్లును తనిఖీ చేశారు. గ్రామస్తుల ఫిర్యాదుకు తోడు , దిశ కథనానికి స్పందించి కాలుష్య నియంత్రణ మండలి ఏఈ పద్మ గ్రామంలోని పారా బాయిల్డ్ రైస్ మిల్లును పరిశీలించారు. రైస్ మిల్లు ఆవరణ తో పాటు పంట భూముల్లో పడుతున్న దుమ్ము, ఊక, తౌడును గుర్తించారు. రైస్ మిల్లు చుట్టూ తెర , షెడ్లు , చెట్ల పెంపకం , ప్రహరీ నిర్మించుకో కుండా ఖాళీగా వదిలేయడంతో పంటల సాగుపై పడి నష్టం వాటిల్లినట్టు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు గుర్తించారు. తమకు రైస్ మిల్లు తో తీవ్ర నష్టం వాటిల్లుతుందని, ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారని గ్రామస్థులు అధికారుల ముందు గోడు వెళ్లబోసుకున్నారు.

పక్కా సమాచారంతో మిల్ బంద్..

కాలుష్య నియంత్రణ అధికారులు తమ మిల్లుపై తనిఖీ చేస్తారనే ముందస్తు సమాచారంతో రైస్ మిల్ యాజమాన్యం మిల్ బంద్ చేయటం , పైన ఉన్న దుమ్మును క్లీన్ చేశారు. ఎప్పుడు నిరంతరంగా నడిపించే రైస్ మిల్ ఒక్కసారిగా ఆగటం పై అధికారులు అడగగా "రిపేర్ వచ్చింది" , "రైస్ వెళ్ళటం లేదు" లాంటి పొంతన లేని సమాధానం ఇచ్చారు. పీసీబీ అధికారులు తనిఖీ చేస్తారు అన్న సమాచారంతో మిల్లు బంద్ చేశారు అని గ్రామస్థులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


Similar News