దిశ ఎఫెక్ట్.. కోమటి కుంట క్లీన్

దిశ కథనానికి మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ, చైర్మన్ అశోక్ గౌడ్ లు స్పందించారు.

Update: 2024-10-01 11:10 GMT

దిశ, నర్సాపూర్: దిశ కథనానికి మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ, చైర్మన్ అశోక్ గౌడ్ లు స్పందించారు. ఆదివారం ‘దిశ’ పత్రికలో ప్రముఖంగా ప్రచురితమైన కంపు కొడుతున్న కోమటికుంట అనే కథనానికి మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, కమిషనర్ రామకృష్ణ స్పందించి కుంటను సందర్శించారు. మంగళవారం జేసీబీ, డోజర్ సహాయంతో మున్సిపల్ సిబ్బంది కుంటలోని చెత్తాచెదారాన్ని, వ్యర్థ పదార్థాలను తొలగించారు. చెత్త తో పాటు వ్యర్థాలు, ప్లాస్టిక్ కవర్స్ ఇతర వాటిని పూర్తిగా తొలగించడం తో కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పండుగల సమయంలో కోమటికుంట చెత్త సమస్య పోవడంతో మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ కు, కమిషనర్ రామకృష్ణ కు కాలనీవాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


Similar News