దిశ ఎఫెక్ట్...మెడికల్ దుకాణాలు తనిఖీ
ఈనెల 1వ తేదీన దిశ దినపత్రికలో వచ్చిన నిబంధనలు బేఖాతర్...అధిక ధరలకు మందుల విక్రయం.. నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ దుకాణాల ఏర్పాటు కథనంపై జిల్లా ఔషధ నియంత్రణ శాఖ డ్రగ్ ఇన్స్పెక్టర్ చంద్రకళ స్పందించారు.
దిశ, కొల్చారం : ఈనెల 1వ తేదీన దిశ దినపత్రికలో వచ్చిన నిబంధనలు బేఖాతర్...అధిక ధరలకు మందుల విక్రయం.. నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ దుకాణాల ఏర్పాటు కథనంపై జిల్లా ఔషధ నియంత్రణ శాఖ డ్రగ్ ఇన్స్పెక్టర్ చంద్రకళ స్పందించారు. గురువారం కొల్చారం మండలంలోని రంగంపేటలో మెడికల్ దుకాణాలను తనిఖీ చేశారు. గ్రామ ప్రారంభంలోనే ఉన్న రెండు మెడికల్ దుకాణాలు తనిఖీ చేసే లోపే మిగిలిన 5 దుకాణాలను యజమానులు మూసివేశారు.
డ్రగ్ ఇన్స్పెక్టర్ తనిఖీ చేసిన రెండు దుకాణాలలో స్టాక్ రిజిస్టర్ బిల్ బుక్కులు రాయడం లేదని తేలింది. ఎక్స్పైరీ మందులు లభ్యమయ్యాయి. లైసెన్స్ కోసం ఒక ఫార్మసిస్టు ధ్రుపత్రాలు లైసెన్స్ లో నమోదు కాగా మందుల కొనుగోలు ఇన్వాయిస్ రసీదులలో మరొకరి పేరు ఉన్నట్లు తేలింది. సంబంధిత మెడికల్ దుకాణాలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు డ్రగ్ ఇన్స్పెక్టర్ చంద్రకళ తెలిపారు.