‘దిశ’ కథనంపై చర్చ.. మ్యాడం తీరుపై సొంత పార్టీ నేతల విమర్శలు
మెదక్ కాంగ్రెస్ లో ‘హస్తవ్యస్తం’ శీర్షికన ప్రచురితమైన ‘దిశ’ కథనంపై ఆ పార్టీ అధిష్టానం స్థానిక నేతలపై సీరియస్ గా స్పందించింది.
మెదక్ కాంగ్రెస్ లో ‘హస్తవ్యస్తం’ శీర్షికన ప్రచురితమైన ‘దిశ’ కథనంపై ఆ పార్టీ అధిష్టానం స్థానిక నేతలపై సీరియస్ గా స్పందించింది. ఒకే పార్టీకి చెందిన నేతలు ఒకే రోజు రెండు ఆందోళనలు వేర్వేరుగా నిర్వహించడంపై స్థానిక నేతల ద్వారా సమాచారం సేకరించారు. ముందుగా డివిజన్ కోసం ధర్నా పిలుపు ఇచ్చిన విషయం తెలిసి కూడా రైతుల ఆందోళన కిసాన్ సెల్ కు సమాచారం ఇవ్వకుండా నిర్వహించడంపై మ్యాడంకు చీవాట్లు పెట్టినట్లు తెలిసింది..
దిశ, మెదక్ ప్రతినిధి:మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే పట్టు బిగిస్తోంది. ఏది ఏమైనా ఈసారి ఎన్నికల్లో విజయం సాధించాలన్న కసితో కార్యకర్తలు ఉన్నారు. కానీ టిక్కెట్ ఆశిస్తున్న వారే గందరగోళం సృష్టించడంతో ఆందోళన కలిగించే అంశంగా మారింది. ప్రధానంగా ఈ నెల 17 న జరిగిన పోటా పోటీ ధర్నాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ అంశం పై ‘హస్త వ్యస్తం’ అనే కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా ‘దిశ’లో వచ్చిన కథనం కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న తీరును వివరించారని పలువురు కార్యకర్తలు పేర్కొన్నారు. ఈ విషయంపై స్థానిక నేతలు రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ చార్జ్‌తో పాటు పీసీసీ అధ్యక్షుడు దృష్టికి సైతం తీసుకు వెళ్లినట్లు తెలిసింది. ఒకే పార్టీ ఒకే రోజు రెండు చోట్ల వేర్వేరు ఆందోళనలు నిర్వహించడం పై ఆరా తీసినట్లు సమాచారం. రామాయంపేట రెవెన్యూ డివిజన్ కోసం కొన్నాళ్లుగా అక్కడి ప్రజలు ఆందోళన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా డీసీసీ అధ్యక్షుడు కంటా రెడ్డి తిరుపతి రెడ్డి భారీ సభ ఏర్పాటు కోసం వారం రోజుల ముందే నిర్ణయించి ఏర్పాట్లు చేశారు. అయితే అదే సమయంలో కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రైతుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ వద్ద ఆందోళన కోసం పిలుపు నిచ్చింది. ఇది కిసాన్ సెల్, డీసీసీ అధ్యక్షుడితో పాటు రైతులు, అన్ని మండలాల అధ్యక్షులు పాల్గొనాలని ఆదేశించింది.. ఇప్పటికే రామాయంపేట రెవెన్యూ డివిజన్ కోసం ఇచ్చిన పిలుపు మేరకు డీసీసీ అధ్యక్షుడితో పాటు ముఖ్య నాయకులు అదే ధర్నాకు వెళ్లారు.
కానీ కిసాన్ సెల్ అధ్యక్షుడు, పార్టీ మండల అధ్యక్షులు లేకుండా కొంత మంది రైతులతో కలిసి మ్యాడం బాలకృష్ణ, సుప్రభాత్ రావు ఆధ్వర్యంలో కొంత మందితో కలిసి ధర్నా చేశారు. కాని ఇందులో రైతులకు సంబంధించిన కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు సైతం లేకుండా నిర్వహించారు. అంటే కాకుండా సుప్రభాత్ రావు టికెట్ ఆశిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. కానీ రామాయంపేట జరిగిన రెవెన్యూ డివిజన్ ధర్నాకు కాకుండా మ్యాడం బాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు వెళ్లడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. డీసీసీ అధ్యక్షుడు చేసే ధర్నాలో పాల్గొనకుండా ఉండేందుకే రైతుల ధర్నా చేపట్టి తమ ఉనికిని పెంచుకునే ప్రయత్నం చేశారన్న చర్చ సాగుతోంది..
రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడి చీవాట్లు..
మెదక్ కలెక్టరేట్ లో మ్యాడం బాలకృష్ణ చెప్పట్టిన ధర్నా కు తమకు ఎలాంటి సంచారం లేదని కిసాన్ సెల్ అధ్యక్షుడు పబ్బతి ప్రభాకర్ రెడ్డి తో పాటు పలు మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర అధిష్ణానం కు ఫిర్యాదు చేశారు.. పార్టీ కి ఉన్న పేరును చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఇందుకు స్పందించిన కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి ఫోన్ లో మ్యాడం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. రైతుల ధర్నా కు కిసాన్ సెల్ అధ్యక్షుడితో పాటు అన్ని మండలాల పార్టీ అధ్యక్షులకు సమాచారం ఇవ్వాలని సూచించినా ఎందుకు ఇవ్వకుండా ఆందోళన చేపట్టారని ప్రశ్నించినట్లు సమాచారం. ప్రధానంగా డీసీసీ అధ్యక్షుడు కూడా కలెక్టరేట్ల వద్ద జరిగే నిరసనలో అందే విధంగా చూడాలని చెప్పమన్నారు.
కానీ వ్యక్తిగత పేరు కోసం ఎలా చేస్తే బాగుండేదని హెచ్చరించినట్లు విశ్వసనీయ సమాచారం. మెదక్ జిల్లాలో జరుగుతున్న వ్యవహారం పై అధిష్టానం సీరియస్ గా ఉన్నట్లు సమాచారం.. గతంలో కూడా పలు పార్టీ కార్యక్రమాలు స్థానిక నేతలకు తెలియకుండా నిర్వహించడం పై పలువురు పార్టీ మండల అధ్యక్షులు మ్యాడం బాలకృష్ణ పై ఫిర్యాదు చేశారు. మళ్లీ అదే తరహా జరగడం పత్రికల్లో కథనాలు రావడంతో త్వరలో స్థానిక పార్టీ నేతలతో పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. రాష్ట్ర ఇన్చార్జ్ కర్ణాటక ఎన్నికల హడావిడి లో ఉండడంతో మెదక్ లో జరుగుతున్న వర్గపోరుపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.