అభివృద్ధే నా లక్ష్యం : ఎమ్మెల్యే

మానకొండూరు నియోజకవర్గం అభివృద్ధే తన లక్ష్యమని డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు.

Update: 2024-12-02 13:04 GMT

దిశ, బెజ్జంకి : మానకొండూరు నియోజకవర్గం అభివృద్ధే తన లక్ష్యమని డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. సోమవారం ప్రజా సమస్యలే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం విజయోత్సవాలలో భాగంగా తెలంగాణ మోడల్ స్కూల్ విద్యాశాఖ ఆధ్వర్యంలో మండల మోడల్ స్కూల్ లో నిర్వహించిన క్రీడా పోటీల్లో పాల్గొని విద్యార్థులతో ముచ్చటించి 2కే రన్ ప్రారంభించారు. అనంతరం కస్తూర్బా గాంధీ పాఠశాలలో గతంలో ఇచ్చిన హామీ మేరకు అసంతృప్తిగా ఉన్న డార్మెటరీ హాల్ నిర్మాణానికి 24 లక్షల నిధులతో చేపట్టిన పనులను ప్రారంభించి బెజ్జంకి లో డ్రైనేజీ నిర్మాణ పనులకు ఇరిగేషన్, పంచాయతీరాజ్ అధికారులతో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మండల ప్రజల సమస్యలను తీర్చడానికి 90 లక్షల తో డ్రైనేజీ పనులను త్వరలో ప్రారంభిస్తామని, దీంతో ప్రజల సమస్యలు తీరనున్నట్లు వెల్లడించారు.

అభివృద్ధే ఎజెండాగా ముందుకు సాగడం జరుగుతుందని, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వర్గం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గడిచిన సంవత్సర కాలంలో ప్రజా సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేయడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న విజయెత్సవాల్లో స్వచ్ఛందంగా ప్రజానీకం హాజరై బ్రహ్మరథం పడుతున్నట్లు త్వరలో రైతు భరోసా రైతులకు అందజేయడం జరుగుతుందన్నారు. బెజ్జంకి లో కాలువలు కబ్జాకు గురి కావడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయని, డ్రైనేజీ వ్యవస్థకు శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని ఇచ్చిన హామీల ప్రకారమే మండలాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, వైస్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ అధ్యక్షుడు ఓగ్గు దామోదర్, పులి సంతోష్, పోచయ్య, మల్లికార్జున్, జిల్లా ప్రభాకర్, జి శ్రీకాంత్, మధుసూదన్ రెడ్డి, కుంట హరికృష్ణ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Similar News