రూ.ఐదు లక్షల అప్పే.. ఆయువు తీసింది

అవసరం కోసం రూ.ఐదు లక్షల అప్పు చేసి అది ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురైన ఓ రైతు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన మనోహరాబాద్ మండలం చెట్ల గౌరారం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది.

Update: 2023-04-28 10:33 GMT
రూ.ఐదు లక్షల అప్పే.. ఆయువు తీసింది
  • whatsapp icon

దిశ, మనోహరాబాద్: అవసరం కోసం రూ.ఐదు లక్షల అప్పు చేసి అది ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురైన ఓ రైతు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన మనోహరాబాద్ మండలం చెట్ల గౌరారం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రావెల్లి దశరథ(60) ప్రభుత్వం గతంలో మంజూరు చేసిన ఎకరం అసైన్డ్ పొలంలో అప్పులు చేసి బోరుబావులు తవ్వించాడు.

అదేవిధంగా చేసిన అప్పుతో కొడుకు వివాహం చేశాడు. ఈ క్రమంలో అప్పులు ఇచ్చిన వాళ్లు డబ్బు తిరిగి అడగ్గా ఏం చేయాలో తెలియక రైతు దశరథ గ్రామ శివారులో ఉన్న అటవీ ప్రాంతంలో ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Tags:    

Similar News